TVK Vijay Campaign | తమిళనాడులోని కరూర్‌లో తమిళ వెట్రి కజగం (TVK) అధినేత, నటుడు విజయ్ నిర్వహించిన ర్యాలీకి జనం భారీగా తరలివచ్చారు. అయితే, భారీగా జనం తరలిరావడంతో తొక్కిసలాంటి పరిస్థితి నెలకొంది. దాంతో పలువురు స్పృహ తప్పి పడిపోయారు. వారిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు ముగ్గురు చిన్నారులు సహా మొత్తం పది మంది చనిపోయినట్లు సమాచారం. ఈ ఘటనలో 20 మంది వరకు స్పృహ కోల్పోయారని తెలుస్తున్నది. బాధితులను కరూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఇందులో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. ర్యాలీలో గుమిగూడిన జనాన్ని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.
కరూర్‌లో జరిగిన ర్యాలీలో టీవీకే అధ్యక్షుడి కార్నర్ మీటింగ్‌కు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. దాంతో విజయ్ ప్రచార వాహనం ముందుకు కదలలేదు. పరిస్థితి అదుపు తప్పుతుండటం చూసి విజయ్ పోలీసుల సహాయం కోరుతూ తన ప్రసంగాన్ని కొద్దిసేపు నిలిపివేయాల్సి వచ్చింది. ఆ తర్వాత తొక్కిసలాంటి పరిస్థితి నెలకొనడంతో కొందరు పార్టీ కార్యకర్తలు స్పృహ తప్పి పడిపోయారు. రెండు అంబులెన్స్‌లు అక్కడికి చేరుకొని స్పృహ తప్పిపడిపోయిన వారిని ఆసుపత్రికి తలించారు. విజయ్ ర్యాలీలో తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడిందని, అనేక మంది ఆసుపత్రి పాలయ్యారని నివేదికలు ఉన్నాయని సీఎం ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. కరూర్ పరిపాలన నుంచి అందిన సమాచారం ఆందోళనకరంగా ఉందన్నారు.
#WATCH | Tamil Nadu: A large number of people attended the campaign of TVK (Tamilaga Vettri Kazhagam) chief and actor Vijay in Karur
A stampede-like situation reportedly occurred here. Several people fainted and were taken to a nearby hospital. More details are awaited.… pic.twitter.com/4f2Gyrp0v5
— ANI (@ANI) September 27, 2025
ఈ మేరకు సహాయక చర్యలు చేపట్టాలని ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్, జిల్లా కలెక్టర్‌కు అన్ని విధాలుగా సహాయం అందించాలని కోరారు. అలాగే, మంత్రి అన్బిల్ మహేశ్‌కు సైతం అవసరమైన సహాయం అందించాలని సూచించారు. కరూర్‌లో సాధారణ పరిస్థితులు పునరుద్ధరించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. కరూర్‌లోని సాధారణ ప్రజలు వైద్యులు, పోలీసులతో సహకరించాలని సీఎం స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. కరూర్‌లో జరిగిన ర్యాలీలో నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ మాజీ మంత్రి సెంథిల్ బాలాజీని లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. మాజీ మంత్రి జిల్లాకు దేశవ్యాప్తంగా అఖ్యాతి గడించారని విమర్శించారు. కరూర్‌లో విమానాశ్రయం నిర్మిస్తామని డీఎంకే హామీ ఇచ్చిందని.. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో ఇప్పుడు విమానాశ్రయం నిర్మించాలని కేంద్రాన్ని అభ్యర్థించిందని విమర్శించారు.
తమిళనాడులో ఖర్జూరాన్ని పండించడానికి ఒక ప్రత్యేక పథకం అమలు చేస్తామని తెలిపారు. ఈ పథకం కింద ఖర్జూరాన్ని పండించడానికి ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలో ఉన్న వారు అమలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా.. కరూర్‌లోని వేలుచామిపురం ప్రాంతంలో భద్రతా కారణాల దృష్ట్యా విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లు విద్యుత్ బోర్డు అధికారులు తెలియజేశారు. యువకులు చెట్ల కొమ్మలపై కూర్చుంటున్నారని.. ఆ ప్రాంతంలో విద్యుత్ లైన్లు ఉన్నందున భద్రతా కారణాల దృష్ట్యా ఈ చర్య తీసుకున్నామని వారు చెప్పారు. విజయ్ తన ప్రచారం ముగించే వరకు ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా ఉండదని అధికారులు పేర్కొన్నారు.
VIDEO | TVK leader Vijay addresses public in Karu. He said: ” I want to thank the police for their support in holding this campaign.”
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/vRWRuAD1xf
— Press Trust of India (@PTI_News) September 27, 2025