తిరువనంతపురం: ఈశాన్య రుతుపవనాల వల్ల కేరళలో వర్షాలు(Kerala Rains) కురుస్తున్నాయి. విస్తరంగా కురుస్తున్న వానల వల్ల అనేక జిల్లాల్లో అప్రమత్తత ప్రకటించారు. 9 జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరో వైపు ముల్లపెరియార్ డ్యామ్‌లో నీటమట్టం వేగంగా పెరుగుతోంది. ఆ డ్యామ్‌లో సుమారు 137 ఫీట్ల మేర నీరు చేరుకున్నది. మొత్తం 13 గేట్లు తెరిచినట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఆ డ్యామ్ నుంచి 5వేల క్యూసెక్కుల నీటిని రిలీజ్ చేస్తున్నారు. తర్వాత పరిస్థితిని బట్టి నీటి విడుదలను పెంచే అవకాశాలు ఉన్నాయి. పెరియార్ నదికి ఇరు వైపు ఉన్న ప్రజల్ని అప్రమత్తంగా ఉంచాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఫ్లడింగ్ ఉండే ప్రదేశాల్లో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆపరేషన్స్ ఇడుక్కి సబ్ కలెక్టర్‌కు అప్పగించారు. ఇడుక్కిలోని అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. ఆ జిల్లాలో వర్షం అధికంగా ఉన్నది. వండిపెరియార్ వద్ద వరద ఉదృతి ఎక్కువగా ఉంది.
இடுக்கி: கனமழையால் இடுக்கி கூட்டாற்றில் வெள்ளப்பெருக்கு! பாலத்தின் அருகே நிறுத்தப்பட்டிருந்த டெம்போ டிராவல்லர் வாகனம் காட்டாற்று வெள்ளத்தில் அடித்துச் செல்லப்பட்டது. வாகனத்தில் யாரும் இல்லாததால் உயிர் சேதம் இல்லை.#Kerala #Idukki #Flood pic.twitter.com/C42UnWwOJj
— PttvOnlinenews (@PttvNewsX) October 18, 2025