షిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో వరుణ బీభత్సం కొనసాగుతూనే ఉన్నది. రాష్ట్రమంతటా వానలు పడుతూనే ఉన్నాయి. ఈ వర్షాలు, వరదల కారణంగా భారీగా ప్రాణ నష్టం జరిగింది. రోజూ మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. బుధవారం మధ్యాహ్నానికి హిమాచల్‌ప్రదేశ్‌లో వర్షాలు, వరదలవల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 88 కి చేరింది.
మరో 16 మంది గల్లంతయ్యారు. అదేవిధంగా ఇప్పటివరకు 100 మంది గాయపడ్డారు. ఈ వర్షాలవల్ల పశునష్టం కూడా భారీగానే సంభవించింది. ఇప్పటివరకు మొత్తం 492 పశువులు మృతిచెందాయి. అంతేగాక 170 ఇళ్లు పూర్తిగా, 600 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. దాదాపు 450 పశువుల కొట్టాలు కూలిపోయాయి. ఇవాళ సాయంత్రం హిమాచల్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ వెల్లడించిన నివేదికలో ఈ వివరాలను పొందుపర్చింది.
Himachal Pradesh | 88 people have lost their lives, 16 missing and 100 injured due to rains in the state. 492 animals have died across the state: State Government pic.twitter.com/NpyX9owtnm
— ANI (@ANI) July 12, 2023