Mowgli | యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రోషన్ కనకాల కథానాయకుడిగా, సాక్షి హీరోయిన్గా, పబ్లిక్ స్టార్ బండి సరోజ్ కుమార్ యాంటీ హీరో పాత్రలో నటించిన లేటెస్ట్ లవ్ థ్రిల్లర్ చిత్రం ‘మోగ్లీ 2025’ ఇప్పుడు ఓటిటిలోకి వచ్చేసింది. దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కించిన ఈ సినిమా డీసెంట్ హైప్ మధ్య థియేటర్లలో విడుదలై, మంచి వసూళ్లు సాధించి తన థియేట్రికల్ రన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. థియేటర్లలో రన్ ముగిసిన తర్వాత ఈ చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. న్యూ ఇయర్ కానుకగా, 2026లో తెలుగు నుంచి మొదటి స్ట్రీమింగ్ సినిమాగా ‘మోగ్లీ 2025’ ఈటీవీ విన్లో అందుబాటులోకి రావడం విశేషం.
ప్రేమ, థ్రిల్లర్ అంశాలను మిళితం చేస్తూ తెరకెక్కిన ఈ సినిమాలో వైవా హర్షతో పాటు ఇతర కీలక నటులు కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. కాల భైరవ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందని ప్రేక్షకులు చెబుతున్నారు. భారీ స్థాయిలో కాకపోయినా, కంటెంట్ పరంగా ఆకట్టుకునే ప్రయత్నం చేసిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మించారు. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు, అలాగే లవ్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడేవారు ఇప్పుడు ‘మోగ్లీ 2025’ను ఈటీవీ విన్లో వీక్షించవచ్చు. కొత్త ఏడాది ప్రారంభంలోనే ఓ ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమా ఓటిటిలోకి రావడంతో మూవీ లవర్స్‌లో మంచి ఆసక్తి నెలకొంది.
మూవీలో రోషన్ సరసన సాక్షి మడోల్కర్ హీరోయిన్గా నటించారు. అతిథి పాత్రల్లో సుహాస్, రియా సుమన్ నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించగా… కాల భైరవ మ్యూజిక్ అందించారు. ఫారెస్ట్ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీ కాగా, మురళీ కృష్ణ అలియాస్ మోగ్లీ (రోషన్ కనకాల) ఓ అనాథ. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన అతను ఊరి పక్కనే ఉన్న అడవినే తన అమ్మగా భావిస్తూ జీవనం సాగిస్తుంటాడు. ఎస్సై కావాలనేది తన కోరిక. అందుకోసం కష్టపడుతూనే సినిమా షూటింగ్స్ కోసం వచ్చే వారికి సాయం చేస్తూ ఉపాధి పొందుతుంటాడు. అలా ఓ సినిమాకు డూప్‌గా నటించాల్సి వస్తుంది. ఆ మూవీ టీంలో డ్యాన్సర్ జాస్మిన్ (సాక్షి మడోల్కర్)ను చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు. అయితే క్రిస్టోఫర్ నుంచి జాస్మిన్ను మోగ్లీ ఎలా కాపాడాడు? తన ప్రేమను గెలవడానికి మోగ్లీ ఏం చేశాడు? అతని ఎస్సై కల నెరవేరిందా? మోగ్లీ, జాస్మిన్ ఒక్కటయ్యారా? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.