మండి: హిమాచల్ ప్రదేశ్లో బియాస్ నది(Beas River) ఉదృతంగా ప్రవహిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బియాస్ నది ఉప్పొంగుతోంది. మండి జిల్లాలోని పాండో ప్రాంతంలో భారీగా వర్షాలు పడుతున్నాయి. చండీఘడ్-మనాలి, చండీఘడ్-కులు హైవేలను మూసివేశారు. అక్కడ ఆ రహదారి వెంట కొండచరియలు విరిగిపడుతున్నాయి. మండి-పండోహ్ మధ్య ట్రాఫిక్ని ఆపేశారు. కటౌలా మార్గంలో ఉన్న ప్రత్యామ్నాయ రూటును కూడా బ్లాక్ చేశారు. అక్కడ కూడా కొండచరియలు విరిగిపడ్డాయి. శుక్రవారం నుంచి ఎడతెరిపిలేకుండా మండిలో వర్షం పడుతోంది. దీంతో స్థానికంగా జనజీవనం స్తంభించిపోయింది.
#WATCH | Beas river overflows in Mandi's Pandoh as the area continues to receive heavy rainfall#HimachalPradesh pic.twitter.com/dLMwCqGneG
— ANI (@ANI) August 12, 2023