Delhi | ఏకధాటిగా మూడు గంటలకు పైగా వాన.. చిగురుటాకులా వణికిపోయిన ఢిల్లీ
భారీ వర్షాలకు ఢిల్లీ నగరం చిగురుటాకులా వణికిపోయింది. శుక్రవారం తెల్లవారు జామున 3 గంటలకు మొదలైన వాన ఏకధాటిగా మూడు గంటలకు పైగా కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
- రికార్డు స్థాయిలో భారీ వర్షాలు
- 1936 తర్వాత అత్యధిక వర్షపాతం
- స్తంభించిన రాజధాని నగరం
- ఎంపీల ఇండ్లలోకి చేరిన నీరు
Delhi | న్యూఢిల్లీ, జూన్ 28: భారీ వర్షాలకు ఢిల్లీ నగరం చిగురుటాకులా వణికిపోయింది. శుక్రవారం తెల్లవారు జామున 3 గంటలకు మొదలైన వాన ఏకధాటిగా మూడు గంటలకు పైగా కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనాలు నీట మునిగాయి. అనేక ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు చేరింది. ప్రగతి మైదాన్ టన్నెల్లో భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో రాజధానిలో జనజీవనం స్తంభించిపోయింది. 24 గంటల్లో ఢిల్లీలో 228.1 ఎంఎం వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంగా ఢిల్లీలో జూన్ నెల మొత్తం కలిపి సగటున 74.1 ఎంఎం వర్షపాతం నమోదవుతుంది. మూడు నెలల్లో కురవాల్సిన వర్షం కంటే ఎక్కువ కేవలం 24 గంటలల్లోనే పడింది. 1936 తర్వాత జూన్‌లో అత్యధిక వర్షపాతం నమోదయ్యింది ఇప్పుడేనని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఎంపీల ఇండ్లలోకి చేరిన నీరు
భారీ వర్షాల కారణంగా ఢిల్లీలోని ఎంపీలు, మంత్రుల ఇండ్లలోకి కూడా నీరు చేరింది. లోధి ఎస్టేట్ ప్రాంతంలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్‌గోపాల్ యాదవ్ ఇంటి ముందు రోడ్డుపై మోకాళ్ల లోతు నీరు నిలవడంతో ఆయనను భుజాలపై ఎత్తుకొని కారు ఎక్కించారు. కాగా, తాను నిద్ర లేచే సరికి తన ఇంట్లోకి అడుగు ఎత్తులో నీరు చేరిందని, ఫర్నీచర్, వస్తువులన్నీ తడిచిపోయాయని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఇటీవల నీటి కొరతతో నిరాహార దీక్షకు దిగిన ఢిల్లీ మంత్రి అతిశీ ఇల్లు కూడా నీట మునిగింది. అసాధారణ రీతిలో భారీ వర్షం కురవడంతో ఢిల్లీ ప్రభుత్వం అత్యవసర సమావేశం నిర్వహించింది. ఢిల్లీలో మొత్తం వర్షాకాలం కలిపి 800 ఎంఎం వర్షం పడాల్సి ఉండగా, 24 గంటల్లోనే ఇందులో 25 శాతం(228 ఎంఎం) వర్షం కురవడం వల్ల సమస్యలు తలెత్తాయని మంత్రి అతిశీ పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

