న్యూఢిల్లీ, మే 3: గురివింద సామెతను గుర్తుకు తెచ్చేలా అసలు వాస్తవాన్ని దాచిపెట్టి లేని అబద్ధాన్ని ప్రచారం చేయాలనుకునే బీజేపీ నేతలు పనితీరును పట్టి ఇచ్చే అసలు సిసలైన ఈ చిత్రంపై ఏమంటారో!
ఇది బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోని టెర్మినల్-2. దీనిని ప్రధాని మోదీ ఇటీవల ప్రారంభించారు. మంగళవారం కురిసిన వర్షానికి టెర్మినల్ పైకప్పు నుంచి నీరు భారీగా లీకైంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిర్మాణ నాణ్యతను, ప్రధాని మోదీని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.