న్యూఢిల్లీ: భారత దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు హృదయ సంబంధ వ్యాధుల కారణంగా మరణిస్తున్నారని, మొత్తం 30 మరణాల్లో 30 శాతం దీని కారణంగానే సంభవిస్తున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇందులో గుండెపోటు, స్ట్రోక్స్ వంటిని ఉన్నాయి. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిపిన శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే వివరాల నివేదికను ‘మరణానికి కారణాలు’ పేరుతో విడుదల చేశారు.
దేశంలో 2021-23 మధ్య అసంక్రమిత వ్యాధుల కారణంగా 56.7 శాతం మంది మరణించారని ఈ నివేదిక తెలిపింది. అలాగే సాంక్రమిక, ప్రసూతి, ప్రసవానంతర, ఆహార లోపం తదితర కారణాలతో 23.4 శాతం మంది కన్నుమూశారు.