Influenza | మారుతున్న వాతావరణంతో ఇన్ఫ్లుయెంజా ముప్పు..! అడ్వైజరీ జారీ చేసిన ఆరోగ్యశాఖ..!
Influenza | ప్రస్తుతం వాతావరణం వేగంగా మారుతున్నది. పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు, ఉదయం, సాయంత్రాల్లో చలిగా ఉంటున్నది. వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఈ క్రమంలో సీజనల్ ఫ్లూ సమస్య ఎక్కువగా కనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
Influenza | ప్రస్తుతం వాతావరణం వేగంగా మారుతున్నది. పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు, ఉదయం, సాయంత్రాల్లో చలిగా ఉంటున్నది. వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఈ క్రమంలో సీజనల్ ఫ్లూ సమస్య ఎక్కువగా కనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని.. ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ సూచించింది. సీజనల్ ఫ్లూ ఇన్ఫ్లుయెంజా వైరస్‌తో కలిగే శ్వాసకోశ ఇన్ఫెక్షన్. ఇది ప్రపంచంలోని అన్నిప్రాంతాల్లోనూ సాధారణమే. చికిత్స లేకుండానే చాలామంది కోరుకుంటున్నారు. ఇన్ఫ్లుఎంజా ఇన్ఫెక్షన్ దగ్గు, తుమ్ముల ద్వారా సులభంగా వ్యాపిస్తుంది.
ఇన్ఫెక్షన్ను నియంత్రించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమంత్రి ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. ఫ్లూ లక్షణాలు కనిపిస్తే ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా, కుటుంబంలో ఇతరులను దాని బారినపడకుండా సురక్షితంగా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇన్‌ఫ్లుయెంజాతో జ్వరం, చలి, దగ్గు, గొంతునొప్పి, ముక్కుకారటం, కండరాలు, ఒంటినొప్పులు, అలసట ఉంటాయి. మరికొందరిలో వాంతులు, విరేచనాలు ఉండే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. పెద్దల్లో కంటే పిల్లల్లో సాధారణంగా కనిపిస్తుంది. అంటువ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఇంట్లోనే ఉండడంతో పాటు మిగతా వారికి దూరంగా ఉండాలని, రద్దీగా ఉండే ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించడంతో పాటు లక్షణాలుంటే వైద్యుడిని సంప్రదించిన తర్వాత మందులు తీసుకోవాలని సూచించింది. ఫ్లూ లక్షణాలు నాలుగు నుంచి వారంలో తగ్గుతాయని.. దగ్గు, అలసట వారాల పాటు కొనసాగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఆకలి లేకపోవడం, తినాలనే కోరిక కూడా ఉండదని పేర్కొంది. చాలా మందికి ఫ్లూ కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం తక్కువగానే ఉంటుందని.. అయితే తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.
ఉబ్బసం, గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధి, మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులు ఫ్లూ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇన్ఫ్లుఎంజాను నివారించడానికి పౌష్టికాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, రోగనిరోధక శక్తిని పెంచే అలవాట్లను అనుసరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వాతావరణం మారిన ప్రతిసారీ మీరు ఫ్లూ బారిన పడినట్లయితే, రోగనిరోధక వ్యవస్థ బలహీనతకు సంకేతం కావొచ్చని.. వైద్యుడిని సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
✅मौसमी बुखार को नज़रअंदाज न करें।
✅#SeasonalFlu संक्रमण को नियंत्रित करने और स्वस्थ रहने के लिए सभी एहतियाती उपाय करें।#SwasthaBharat
#HealthForAll pic.twitter.com/m4bypWmh4J— Ministry of Health (@MoHFW_INDIA) February 24, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SSC Exam Fee | విద్యాశాఖ డొల్లతనం.. టెన్త్ పరీక్ష ఫీజుల ఆన్లైన్ చెల్లింపుల్లో సర్వర్ సమస్య
Bureaucrats | డోంట్‌కేర్ సర్కార్.. ప్రభుత్వం పనైపోయింది, మళ్లీ వచ్చేది లేదు! నిర్ధారణకు వచ్చిన బ్యూరోక్రాట్లు
BC Atma Gaurava Bhavans | బీసీల ‘ఆత్మగౌరవం’పై కాంగ్రెస్ సర్కార్ పెత్తనం.. వేల కోట్ల విలువైన ఆస్తుల హస్తగతానికి గుట్టుగా జీవో!
ఈవీ ఛార్జింగ్.. తప్పని వెయిటింగ్
ధరలపై దండెత్తిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

