ఉరేసుకుని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
Head Conistable Suicide: జైసల్మేర్ జిల్లాకు చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ తన అధికారిక నివాసంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

జైసల్మేర్: రాజస్థాన్‌లో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. జైసల్మేర్ జిల్లాకు చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ తన అధికారిక నివాసంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. జైసల్మేర్ జిల్లాలోని మోహన్‌గఢ్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న భజన్‌లాల్ (46) మంగళవారం విధులకు హాజరుకాలేదు.
ఎలాంటి సమాచారం ఇవ్వకుండా భజన్‌లాల్ విధులకు హాజరుకాకపోవడంతో అధికారులు విచారణ కోసం ఓ కానిస్టేబుల్‌ను అతని ఇంటికి పంపించారు. ఆ కానిస్టేబుల్ ఎంతసేపు తలుపుతట్టినా భజన్‌లాల్ తీయకపోవడంతో పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చాడు. దాంతో అధికారుల ఆదేశాల మేరకు మరికొందరు కానిస్టేబుల్లు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా భజన్‌లాల్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు.
దాంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఘటనా ప్రాంతంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని, భజన్‌లాల్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

