చెన్నై : తమ సంరక్షణను పట్టించుకోని పక్షంలో తమ పిల్లలు లేదా సమీప బంధువులకు చేసిన గిఫ్ట్ డీడ్లు లేదా సెటిల్మెంట్ డీడ్లను రద్దు చేసుకునే హక్కు సీనియర్ సిటిజన్లకు ఉంటుందని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. డీడ్లలో ఒకవేళ అటువంటి షరతులు ఏమీ లేనప్పటికీ వాటిని రద్దు చేసుకునే హక్కు సీనియర్ సిటిజన్లకు ఉంటుందని హైకోర్టు ధర్మాసనం తాజాగా తేల్చి చెప్పింది. సీనియర్ సిటిజన్ ఎస్ నాగలక్ష్మి కోడలు ఎస్ మాల దాఖలు చేసిన అప్పీలును కొట్టివేస్తూ ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.