చెన్నై: వితంతువు ప్రవేశంతో ఆలయం అపవిత్రం అవుతుందన్న మూఢ నమ్మకాలు నాగరిక సమాజంలో కూడా కొనసాగడం దురదృష్టకరమని శుక్రవారం మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈరోడ్ జిల్లా నంబియూర్ తాలుకాలోని ఓ ఆలయంలోకి ప్రవేశించకుండా తంగమణిని నిర్వాహకులు అడ్డుకోవడాన్ని తప్పుబట్టింది.
సదరు మహిళ హైకోర్టును ఆశ్రయించగా జస్టిస్ ఆనంద్ ఆలయ ప్రవేశాన్ని కల్పించాలని ఆదేశించారు.