Gulab Jamun Chat | గులాబ్ జామూన్ తిన్నాం కానీ.. గులాబ్ జామూన్ చాట్ అయితే ఎప్పుడూ తినలేదు అంటారా. కానీ ఈ వీడియో చూస్తే గులాబ్ జామూన్ చాట్ అనే ఒక వంటకం కూడా ఉంటుందా అని నోరెళ్లబెడతారు. అవును.. ఈ మధ్య సోషల్ మీడియాలో ఇలాంటి విచిత్రమైన, వింతైన వంటకాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
ఐస్క్రీమ్ పానీపూరీ, యాపిల్ పకోడీ, ఓరియో పకోడి లాంటి ఎన్నో వింత వంటకాల గురించి చూశాం. తాజాగా గులాబ్ జామూన్ చాట్ గురించి నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
టంగ్ ట్విస్టర్ అనే ఇన్స్టా అకౌంట్లో గులాబ్ జామున్ చాట్ తయారు చేసే వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోను చూసిన నెటిజన్లు.. ఇదెక్కడి కాంబో బాబోయ్ అంటూ నోరెళ్లబెడుతున్నారు.