Ram Gopal Varma | గొప్పవాళ్లంతా సింగిల్సే.. ప్రతి సక్సెస్ఫుల్ వ్యక్తి వెనుక మహిళ ఉండదు: ఆర్జీవీ సంచలన పోస్ట్
Ram Gopal Varma | టాలీవుడ్లో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి తన సంచలన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. నిత్యం ఏదో ఒక అంశంపై తనదైన శైలిలో స్పందించే ఆర్జీవీ.. తాజాగా సింగిల్స్ గురించి చేసిన వ్యాఖ్యలు నెటిజన్ల మధ్య ఆసక్తికర చర్చకు దారితీశాయి.
Ram Gopal Varma | టాలీవుడ్లో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి తన సంచలన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. నిత్యం ఏదో ఒక అంశంపై తనదైన శైలిలో స్పందించే ఆర్జీవీ.. తాజాగా సింగిల్స్ గురించి చేసిన వ్యాఖ్యలు నెటిజన్ల మధ్య ఆసక్తికర చర్చకు దారితీశాయి. సాధారణంగా ప్రతి విజయవంతమైన పురుషుడి వెనుక ఒక మహిళ ఉంటుంది అనే మాటను తరచూ వింటుంటాం. అయితే ఈ మాటతో తాను ఏకీభవించనన్నట్లుగా ఆర్జీవీ తన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. దేశంలో, ప్రపంచంలో గొప్ప విజయాలు సాధించిన అనేక మంది ప్రముఖులు సింగిల్స్‌గా ఉన్నారంటూ ఆసక్తికరమైన పేర్లను ప్రస్తావించారు.
ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, టాటా, బాటా, ఏపీజే అబ్దుల్ కలాం, సల్మాన్ ఖాన్, రాహుల్, యోగి, బాబా రాందేవ్ వంటి ప్రముఖులను ఉదాహరణగా చెబుతూ.. ప్రతి సక్సెస్ఫుల్ పురుషుడి వెనుక మహిళ ఉండాల్సిన అవసరం లేదు. గొప్పవాళ్లు సింగిల్స్‌గా కూడా గొప్ప విజయాలు సాధించగలరు అనే అర్థంలో ఆర్జీవీ వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ పోస్ట్ క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు ఆర్జీవీ అభిప్రాయంతో ఏకీభవిస్తుండగా, మరికొందరు మాత్రం ఆయన వ్యాఖ్యలను సరదాగా తీసుకుంటూ సెటైర్లు వేస్తున్నారు. “ఈ గొప్పవాళ్ల జాబితాలో మీరు ఎక్కడ ఉన్నారు?” అంటూ కొందరు నెటిజన్లు ఆర్జీవీని ఫన్నీగా ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు ఆయనపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
ఏది ఏమైనా.. ఎప్పటిలాగే ఆర్జీవీ చేసిన ఒక్క పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకే కారణమైంది. సింగిల్‌గా ఉండటం, వివాహం చేసుకోవడం వ్యక్తిగత ఎంపిక అని.. విజయానికి వాటితో సంబంధం లేదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతుండగా, మరికొందరు మాత్రం “ప్రతి విజయానికి వెనుక కుటుంబం, స్నేహితులు, సహచరుల మద్దతు కూడా కీలకమే” అంటూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి తన వివాదాస్పద, విభిన్న ఆలోచనలతో మరోసారి నెటిజన్లను చర్చకు లాగిన రాంగోపాల్ వర్మ.. ఈసారి “సింగిల్సే గ్రేట్” అంటూ చేసిన కామెంట్లతో వార్తల్లో నిలిచారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు
Manne Krishank | రూ.80 వేల కోట్ల భూమి 10 వేల కోట్లకే.. 818 ఎకరాలను గుట్టుగా తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్: మన్నె క్రిశాంక్
Land Scam | 818 ఎకరాలు తాకట్టు.. కంచె గచ్చిబౌలి తరహాలో రేవంత్ సర్కార్ మరో భూ బాగోతం
Bigg Boss 10 | కెప్టెన్‌గా సుధీర్ రెడ్డి.. అగ్నిపరీక్ష బ్యాచ్‌కు పెద్ద షాక్!
CJP Protest | రైళ్ల నుంచి దింపివేత, ఇండ్లకెళ్లి అరెస్టులు.. పోలీసుల నిర్బంధంలో వేలాది మంది యువజనులు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

