Fire Fruits Dosa | ఆనియన్ దోశ తెలుసు. మసాలా దోశ తెలుసు. చివరకు ఎగ్ దోశ కూడా తెలుసు. కానీ.. ఈ ఫైర్ ఫ్రూట్స్ దోశ ఏంటి.. అంటారా? ఈ వెరైటీ దోశను ఢిల్లీలో తయారు చేస్తున్నారు. ఢిల్లీలోని గీతా కాలనీలో ఉన్న అయ్యర్‌జీ దోశ వాలె హోటల్లో ఈ దోశ దొరుకుతుంది.
సాధారణంగా చేసే దోశతో పోల్చితే ఇది చాలా వెరైటీ దోశ. ముందు మంట పెనం మీదకి వచ్చేలా చేస్తారు. ఆ తర్వాత పిండి వేసి అందులో రకరకాల ఫ్రూట్స్ వేసి దోశను తయారు చేస్తారు. ఈ సరికొత్త దోశ టేస్ట్‌కు అక్కడి వాళ్లు ఫిదా అయిపోతున్నారట. అందుకే.. ఆ దోశను తినడం కోసం క్యూ కడుతున్నారు జనాలు.
ఈ దోశ తయారీ వీడియోను ఓ ఫుడ్ బ్లాగర్ తన ఇన్‌స్టా అకౌంట్లో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.