లక్నో, జూలై 9: హాథ్రస్లో తొక్కిసలాట ఘటనపై సిట్ మంగళవారం తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. హాథ్రస్ ఘటనలో నిర్వహణాపరమైన లోపాలు ఉన్నాయని పేర్కొన్న నివేదిక.. ఇదే సమయంలో ఘటన వెనుక ‘భారీ కుట్ర’ కోణాన్ని కూడా కొట్టిపారేయలేమని పేర్కొన్నది.
ఈ విషాద ఘటనకు నిర్వాహకులే బాధ్యులని పేర్కొన్నది. భోలే బాబా పేరును ఎక్కడా ప్రస్తావించకుండా ఓ విధంగా ఆయనకు సిట్ క్లీన్చిట్ ఇచ్చింది. కాగా, భోలే బాబాకు సంబంధించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజస్థాన్లోని ఆశ్రమంలో భోలే బాబా ఉన్న సమయంలో మహిళా భక్తులను మాత్రమే ఆశ్రమంలోకి అనుమతించే వారని గ్రామస్తులు చెబుతున్నారు.