Pooja Khedkar | న్యూఢిల్లీ : వివాదాస్పద మాజీ ఐఏఎస్ ట్రైనీ అధికారి పూజా ఖేద్కర్ దుబాయ్ వెళ్లిపోయినట్లు మీడియా కథనాలను బట్టి తెలుస్తున్నది. ఆమెకు ముందస్తు బెయిలు మంజూరు కాకపోవడంతో ఆమె దేశం విడిచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఆమె మోసపూరితంగా ఓబీసీ, డిజెబిలిటీ కోటా ప్రయోజనాలను పొందినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె ట్రైనీ ఐఏఎస్ అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ రద్దు చేసింది. తనను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని, ముందస్తు బెయిలు మంజూరు చేయాలని ఆమె ఢిల్లీ కోర్టును కోరారు. కానీ కోర్టు గురువారం ఆమె పిటిషన్ను తిరస్కరించింది.