చండీగఢ్: టోల్ ఫీజు ఎగ్గొట్టేందుకు ఆర్డీసీ బస్సును డ్రైవర్ వేగంగా నడిపాడు. ఈ నేపథ్యంలో అక్కడున్న సిబ్బందిపైకి ఆ బస్సును దూకించాడు. ఆ టోల్ బూత్ వద్ద ఉన్న సీసీటీవీలో ఇది రికార్డైంది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (bus crushes toll workers to evade fee) హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్ర ఆర్టీసీకి చెందిన ఒక బస్సు గురుగ్రామ్ నుంచి సోహ్నా వైపు వెళ్తున్నది. ఘమ్రోజ్ టోల్ బూత్ వద్ద ముందున్న కారు బయలుదేరింది.
కాగా, టోల్ రుసుం ఎగ్గొట్టేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. దీంతో బస్సును వేగంగా నడిపాడు. పక్కనే ఉన్న ఇద్దరు టోల్ సిబ్బంది మీద నుంచి దూసుకెళ్లాడు. దీంతో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిర్లక్ష్యంగా బస్సును నడిపిన డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. టోల్ బూత్ వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డైన ఫుటేజ్‌ను పరిశీలించారు. దీని ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా, టోల్ ఫీజు ఎగ్గొట్టేందుకు సిబ్బందిపైకి బస్సును నడిపి దూసుకెళ్లిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A Haryana Roadways bus crushed a toll employee in an apparent attempt to escape paying the toll fee. The incident, recorded on CCTV, happened at the Ghamroj toll plaza on the Gurugram-Sohna road. The impact left the employee severely injured.
Read more: https://t.co/p1juvHi9Sf… pic.twitter.com/NdIYSAOee4
— IndiaToday (@IndiaToday) February 2, 2025