ఝజ్జర్: హర్యానాలో మాజీ మంత్రి మంగే రామ్ రాఠీ కుమారుడు జగదీశ్ రాఠీ (55) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఝజ్జర్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఆయన విషం తాగి ప్రాణం తీసుకున్నాడు. ఆస్తి తగాదాలే ఆయన ఆత్మహత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఆస్తి విషయంలో ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (INLD) పార్టీ హర్యానా రాష్ట్ర అధ్యక్షుడు నఫే సింగ్ రాఠీ, అతని మనుషుల వేధింపులు భరించలేకనే జగదీశ్ రాఠీ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు ఆరోపించారు.
జగదీశ్ రాఠీ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నఫే సింగ్ రాఠీ సహా ఆరుగురిపై ఒక వ్యక్తిని ఆత్మహత్యకు పురికొల్పిన నేరం కింద కేసులు నమోదు చేశారు. కాగా, జగదీశ్ రాఠీ డిసెంబర్ 26న ఇదే విషయమై సోషల్ మీడియాలో ఓ ఆడియో క్లిప్‌ను సర్క్యులేట్ చేశాడు. తనను కొందరు వ్యక్తులు వేధిస్తున్నారని, తనకు ఏదైనా జరిగితే వాళ్లే బాధ్యత వహించాలని ఆ వీడియోలో వ్యాఖ్యానించాడు. దాంతో పోలీసులు స్పందించి ఫిర్యాదు చేయమని సూచించగా జగదీశ్ రాఠీ నిరాకరించాడు.