నుహ్: హర్యానా(Haryana)లోని నుహ్ జిల్లాలో ఇవాళ కూడా అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతోంది. ఎస్కేఎం గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వద్ద రోడ్డు వెంట ఉన్న నిర్మాణాలను బుల్డోజర్లతో తొలిగిస్తున్నారు. అక్రమంగా నిర్మించిన సుమారు 45 కమర్షియల్ దుకాణాలను తొలగించినట్లు జిల్లా టౌన్ ప్లానర్ తెలిపారు.
#WATCH | Haryana administration demolishes illegal constructions near SKM Government Medical College in Nuh district pic.twitter.com/r2htjmGpyh
— ANI (@ANI) August 5, 2023
హర్యానాలోని నుహ్లో ఇటీవల చెలరేగిన హింసలో నిందితులుగా పేర్కొంటూ, అక్రమంగా ఇండ్లు నిర్మించారని ఆరోపిస్తూ కొంతమంది ఇండ్లపై రాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్లను ప్రయోగించింది. తవురు పట్టణంలో సుమారు 250 గుడిసెలను గురువారం కూల్చివేసిన విషయం తెలిసిందే.
సీఎం ఖట్టర్ ఆదేశాలతో వాటిని పడగొట్టినట్టు రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్ తెలిపారు. కాగా, జిల్లా ఎస్పీ వరుణ్ సింగ్లా, డిప్యూటీ కమిషనర్ ప్రశాంత్ పన్వార్లను ప్రభుత్వం బదిలీ చేసింది. వారి స్థానంలో నరేంద్ర బిజర్నియా ఎస్పీగా, డిప్యూటీ కమిషనర్గా ధీరేంద్ర ఖడ్గటలను నియమించింది.