Harshita Goyal : సివిల్ సర్వీసెస్ (Civil services) ఫలితాల్లో గుజరాత్ (Gujarat) కు చెందిన హర్షిత గోయల్ (Harshita Goyal) సత్తా చాటారు. ఆలిండియా ర్యాంకింగ్స్‌లో ఆమె రెండో ర్యాంకును సొంతం చేసుకున్నారు. సివిల్స్‌లో ఇంత అద్భుత విజయం దక్కడంపట్ల ఆమె ఆనందం వ్యక్తంచేశారు. తన కుటుంబం నుంచి తానే మొదటి సివిల్ సర్వెంట్ కాబోతున్నానని అన్నారు.
సివిల్స్ లక్ష్యం వైపు ప్రయాణంలో తన కుటుంబం నుంచి ఎంతో మద్దతు లభించిందని హర్షిత తెలిపారు. తల్లి లేకపోయినా తన తండ్రి అన్ని విధాలుగా ఎంతగానో ప్రోత్సహించారని ఈ సందర్భంగా హర్షిత గుర్తుచేసుకున్నారు. తన స్నేహితులూ సపోర్టు చేశారని ఆమె చెప్పారు. ప్రజల జీవితాల్లో మరీ ముఖ్యంగా మహిళల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ఐఏఎస్ కావాలనుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు.