ప్రస్తుతం అందరి కళ్లు భారత్, పాక్ మ్యాచ్ వైపే ఉన్నాయి. ఇప్పటికే మ్యాచ్ ప్రారంభం అయింది. టాస్ గెలిచిన పాకిస్థాన్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్ బరిలోకి దిగింది.
ఈనేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ట్విట్టర్లో స్పందించారు. టాస్ గెలిచిన పాకిస్థాన్.. ఆ కాయిన్ను తమ దేశానికి తీసుకెళ్లి పాక్ ఎకానమీని పెంచుకుంటారట.. అంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మ్యాచ్ ప్రారంభం అయిందో లేదో అప్పుడే పాకిస్థాన్ మీద జోకులు స్టార్ట్ చేశారా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
BREAKING NEWS :
— Harsh Goenka (@hvgoenka) October 24, 2021
Pakistan has won the toss and decided to take the coin back to Pakistan to improve their economy.#INDvPAK