ఆక్సిజన్ తగ్గినా కనిపించని లక్షణాలు
నాగ్‌పూర్, మే 12: కరోనా సోకిన కొంత మంది ఉన్నట్టుండి కుప్పకూలిపోవడం, ఆక్సిజన్ అందక చనిపోవడం లాంటి ఘటనలు ఇటీవల ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా యువతలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం ‘హ్యాపీ హైపోక్సియా లేదా సైలెంట్ హైపోక్సియా’ అని వైద్యులు చెప్తున్నారు. కరోనా సోకిన వారిలో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతుంది. ఆయాసం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. కానీ ఇటీవల యువతలో ఆక్సిజన్ స్థాయి తగ్గుతున్నా ఆయాసం లాంటి లక్షణాలు కనిపించడం లేదు.
92% కంటే తగ్గితే దవాఖానకు
జ్వరం, దగ్గు లాంటి లక్షణాలు ఉంటే కరోనా వైరస్ సోకిందా.. లేదా అన్నదానితో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు ఆక్సిజన్ స్థాయిని పరీక్షించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పల్స్ ఆక్సీ మీటర్లో 92 శాతం కంటే తక్కువ ఆక్సిజన్ లెవెల్ చూపిస్తే వెంటనే దవాఖానకు వెళ్లి వైద్యులను సంప్రదించాలని, వైద్యుల సూచనలతో హెచ్ఆర్సీటీ స్కానింగ్ చేసుకోవాలని కోరుతున్నారు.
హ్యాపీ హైపోక్సియా లక్షణాలు
టాయిలెట్‌కు వెళ్లినప్పుడు ఆయాసం, పెదవులు నీలం రంగులోకి మారడం, చల్లని వాతావరణంలో కూడా చెమట రావడం.