H1B Visa | అమెరికాలోనే హెచ్1బీ రెన్యువల్.. భారతీయులకు త్వరలో తీరనున్న వీసా కష్టాలు
అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులకు త్వరలో వీసా కష్టాలు తీరనున్నాయి. హెచ్-1బీ వీసాల పునరుద్ధరణ కోసం వారు భారత్‌కు తిరిగి రావాల్సిన అవసరం లేకుండా అక్కడే రెన్యువల్ చేసుకునే సదుపాయాన్ని కల్పించబోతున్నట్టు న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది.
- పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్.. ఈ ఏడాదే అమలు
H1B Visa | న్యూఢిల్లీ, జనవరి 6: అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులకు త్వరలో వీసా కష్టాలు తీరనున్నాయి. హెచ్-1బీ వీసాల పునరుద్ధరణ కోసం వారు భారత్‌కు తిరిగి రావాల్సిన అవసరం లేకుండా అక్కడే రెన్యువల్ చేసుకునే సదుపాయాన్ని కల్పించబోతున్నట్టు న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుతం అమెరికాలో పనిచేస్తూ వీసాల పునరుద్ధరణ కోసం స్వదేశానికి రావాలనుకుంటున్న ఎంతో మంది భారత వృత్తి నిపుణులకు వరంలా నిలిచే ఈ కార్యక్రమం ఈ ఏడాదిలోనే అమలులోకి వచ్చే అవకాశం ఉన్నది.
అమెరికాలో హెచ్-1బీ వీసాల కోసం ఇప్పటికే ప్రయోగాత్మకంగా చేపట్టిన కార్యక్రమం (పైలట్ ప్రోగ్రామ్) విజయవంతంగా ముగియడంతో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఏడాది అమెరికా బేస్డ్ వీసా రెన్యువల్ కార్యక్రమాన్ని అధికారికంగా ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు అమెరికా తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

