వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో శివలింగం బటయపడినట్లు సర్వే ద్వారా తేలిన విషయం తెలిసిందే. అయితే ఆ వివాదాస్పద మసీదుపై రిపోర్ట్‌ను కోర్టుకు సమర్పించేందుకు డెడ్‌లైన్ దగ్గరపడింది. ఇవాళ పూర్తి స్థాయి రిపోర్ట్‌ను కోర్టుకు సమర్పించే అవకాశాలు లేవని తెలుస్తోంది. మే 14 నుంచి 16వ తేదీ వరకు సర్వే నిర్వహించాలని అసిస్టెంట్ కోర్ట్ కమీషనర్ అజయ్ ప్రతాప్ సింగ్ తెలిపారు. అయితే ఇప్పటి వరకు కేవలం 50 శాతం మాత్రమే నివేదిక తయారైనట్లు ఆయన చెప్పారు. అందుకే ఇవాళ కోర్టుకు ఆ రిపోర్ట్‌ను ఇవ్వలేమన్నారు. సర్వే కోసం మరో రెండు లేదా మూడు రోజుల సమయాన్ని కోరనున్నట్లు ఆయన చెప్పారు. కోర్టు నియమించిన స్పెషల్ అసిస్టెంట్ కమిషనర్ అడ్వకేట్ విశాల్ సింగ్ మాత్రం భిన్న స్వరాన్ని వినిపించారు. సర్వే రిపోర్ట్ దాదాపు పూర్తి అయ్యిందన్నారు. అనుకున్న సమయానికే నివేదికను సమర్పించనున్నట్లు విశాల్ తెలిపారు. జ్ఞానవాపి కేసులో సుప్రీంకోర్టు ఇవాళ పిటిషన్ విచారణకు స్వీకరించనున్నది.