న్యూఢిల్లీ: 26వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా జ్ఞానేశ్‌కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అలాగే, ఎన్నికల కమిషనర్‌గా వివేక్ జోషి కూడా చార్జ్ తీసుకున్నారు.
ఎన్నికల సంఘం సభ్యుడిగా కొనసాగుతున్న జ్ఞానేశ్‌కుమార్‌ను కేంద్రం సీఈసీగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. మొన్నటివరకు సీఈసీగా వ్యవహరించిన రాజీవ్‌కుమార్ మంగళవారం పదవీ విరమణ చేశారు.