న్యూఢిల్లీ: లైంగిక సామర్థ్యాన్ని పెంచే డ్రగ్స్ తీసుకుని.. గురుగ్రామ్‌లోని తన ఫ్లాట్‌లో 29 ఏళ్ల వ్యక్తి మృతిచెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సెక్టార్ 53లో ఉన్న పీజీ ఫ్లాట్‌లో అతని మృతదేహాన్ని గుర్తించారు. లైంగిక సామర్థ్యాన్ని రెట్టింపు చేసే కొన్ని మందులను రూమ్‌లో గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం.. బాధిత వ్యక్తిని రోహిత్ లాల్‌గా గుర్తించారు. అతని స్వస్థలం నాగపూర్. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆఫీసులో అతను పనిచేస్తున్నాడు. గురుగ్రామ్‌లోని ఓ రెంట్ ఇంట్లో ఉంటున్నాడు. పోస్టుమార్టమ్ నిర్వహించిన తర్వాత అతని మృతదేహాన్ని ఫ్యామిలీకి అప్పగించారు. అయితే గురువారం ఉదయం లాల్‌తో పనిచేసే వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
సహచర ఉద్యోగి ప్రకారం.. ఇద్దరూ ప్రతి రోజు కలిసి ఉద్యోగానికి వెళ్తుంటారు. కానీ ఘటన జరిగిన రోజు లాల్ ఫోన్ ఎత్తలేదు. అతని రూమ్డోర్ కూడా ఓపెన్ చేయలేదని చెప్పాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వాళ్లు ఆ డోరు తీశారు. బెడ్‌పై లాల్ మృతదేహాన్ని గుర్తించారు. రూమ్ నుంచి మెడిసిన్స్, హెల్త్ సప్లిమెంట్లను కూడా రికవరీ చేశారు. తన కాబోయే భార్యను రూమ్‌కు ఇన్వైట్ చేశారని, కానీ ఫియాన్సీ వచ్చేలోపే అతను చనిపోయినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. బహుశా శృంగార ఉత్ప్రేరక డ్రగ్ తీసుకోవడం వల్ల మృతిచెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఓవరుడోసు వల్ల హార్ట్ ఎటాక్ వచ్చినట్లు భావిస్తున్నారు.
ఉదర శ్యాంపిళ్లను, మెడిసిన్స్.. ఎఫ్ఎస్ఎల్ టెస్టింగ్ కోసం పంపామని, అయితే విసెరా రిపోర్టు వచ్చాకే మృతికి కారణం తెలుస్తుందని, అన్ని కోణాల్లో విచారణ జరుగుతోందని పోలీసు అధికారి సత్యేందర్ రావల్ తెలిపారు.