న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ మహారాష్ట్ర అదనపు గవర్నర్గా నియమితులయ్యారు. ఇంతవరకు మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ మంగళవారం జరిగిన ఎన్నికలో భారత ఉప రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో ఆయన గురువారం పదవికి రాజీనామా చేశారు.
దీంతో దేవవ్రత్కు మహారాష్ట్ర గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.