హైదరాబాద్, (నమస్తే తెలంగాణ): గుజరాత్లో పట్టుబడిన ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ (ఐఎస్కేపీ)కు చెందిన ఉగ్రమూలాలు తెలంగాణలో వెలుగుచూశాయి. గుజరాత్ ఏటీఎస్ సమాచారం మేరకు పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వరంగల్, రామగుండంతోపాటు హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేట్, పాతబస్తీల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు.
టోలీచౌకీలో పట్టుబడిన మహమ్మద్ జావీద్ సాఫ్ట్వేర్ ట్రైనర్‌గా పని చేస్తున్న చోట తనిఖీలు చేపట్టారు. నాలుగు కోచింగ్ సెంటర్ల సీసీ టీవీ ఫుటేజ్‌లను సైతం స్వాధీనం చేసుకున్నారు. కోచింగ్ మాటున ఉగ్రకోణం ఏదైనా దాగి ఉందా? అనే కోణంలో విచారిస్తున్నారు. పోలీసులు మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్టు భోగట్టా.