న్యూఢిల్లీ, అక్టోబర్ 13: గుజరాత్ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ గోపాల్ ఇటాలియాను రెండున్నర గంటలపాటు పోలీసులు నిర్బంధించడంతో హైడ్రామా నెలకొంది. ప్రధాని మోదీపై ఇటాలియా చేసిన వ్యాఖ్యలు లింగసమానత్వానికి విరుద్ధంగా ఉన్నాయనే కారణంతో ఆయనకు జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ (ఎన్సీడబ్ల్యూ) రేఖాశర్మ సమన్లు జారీ చేశారు. దీంతో గురువారం ఆయన ఎన్సీడబ్ల్యూ ఎదుట హాజరయ్యేందుకు వచ్చారు. ఇటాలియాకు మద్దతుగా తరలివచ్చిన ఆప్ నాయకులు మహిళా ప్యానెల్ బయట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే ఇటాలియాను నిర్బంధించినట్టు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. కాగా, తనను జైల్లో పెడతానని ఎన్సీడబ్ల్యూ చీఫ్ రేఖాశర్మ భయపెడుతున్నదని ఇటాలియా ఆరోపించారు.