Gudi Padwa | భజన పాటలు, కోలాటాలతో ఘనంగా గుడిపడ్వ సంబురాలు.. వీడియోలు
Gudi Padwa | హిందూ సాంప్రదాయ క్యాలెండర్‌లోని నూతన సంవత్సరం మొదటి రోజును మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో గుడిపడ్వగా జరుపుకుంటారు. 14 సంవత్సరాల వనవాసం తర్వాత శ్రీరామ చంద్రుడికి పట్టాభిషేకం చేసింది కూడా ఇదే రోజు అని పురాణాలు చెబుతున్నాయి.
ముంబై: హిందూ సాంప్రదాయ క్యాలెండర్‌లోని నూతన సంవత్సరం మొదటి రోజును మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో గుడిపడ్వగా జరుపుకుంటారు. 14 సంవత్సరాల వనవాసం తర్వాత శ్రీరామ చంద్రుడికి పట్టాభిషేకం చేసింది కూడా ఇదే రోజు అని పురాణాలు చెబుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇదేరోజును ఉగాది అంటారు. ఉదయాన్నే దైవారాధన, మామిడాకుల తోరణాలు, షడ్రుచుల ఉగాది పచ్చడి, బక్షాలు, పంచాంగం శ్రవణం తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ ప్రత్యేకతలు.
అయితే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఇదే పండుగను గుడిపడ్వగా జరుపుకుంటారు. గుడిపడ్వ రోజున ప్రజలు నూనె స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, పూజలు చేస్తారు. ఇంటి గుమ్మాలకు మామిడాకు తోరణాలు కడుతారు. ఇంటిముందు అందమైన రంగోళీలు వేస్తారు. ఆ తర్వాత వీధుల్లో ఉత్సవాలు మొదలవుతాయి. ప్రజలు సాంప్రదయ దుస్తులు ధరించి బ్యాండు మేళాలు, భజన పాటలు, నృత్యాలతో సంబురాలు చేసుకుంటారు.
2020లో కరోనా మహమ్మారి విస్తరణతో గత మూడేండ్లుగా గుడిపడ్వ ఉత్సవాలను పూర్తిస్థాయిలో జరుపుకోలేకపోయారు. ఇన్నేండ్ల తర్వాత ఇప్పుడు ఎలాంటి ఆంక్షలు లేకుండా వేడుకలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని ముంబై, నాగ్‌పూర్ నగరాల్లో గుడిపడ్వ సంబురాలకు సంబంధించిన పొటోలను ఈ కింది వీడియోలో చూడవచ్చు..
#WATCH | Maharashtra: Gudi Padwa is being celebrated in the state. Visuals of vibrant celebrations from Mumbai. pic.twitter.com/wLHdRDUvyP
— ANI (@ANI) March 22, 2023
#WATCH | Maharashtra: Gudi Padwa is being celebrated. Visuals of vibrant celebrations from Nagpur pic.twitter.com/Zn2UnHapKF
— ANI (@ANI) March 22, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

