న్యూఢిల్లీ: పంజాబ్లోని మోగా జిల్లాలో భారీ జీఎస్టీ మోసం వెలుగు చూసింది. ఓ దినసరి కార్మికుడి ఆధార్, పాన్ కార్డు చౌర్యానికి గురి కావడంతో ఆ కార్మికుడికి రూ. 35 కోట్ల పన్ను బకాయి ఉందంటూ జీఎస్టీ శాఖ నుంచి నోటీసు వచ్చింది. దినసరి కార్మికుడిగా పనిచేసి తన కుటుంబాన్ని పోషించుకుంటున్న అజ్మీర్ సింగ్ ఇంత భారీ మొత్తాన్ని తనకు ఎలా ముడి పెట్టారో అర్థం కావడం లేదని వాపోయారు. తనకు ఇలా జరగడం ఇది మొదటిసారి కాదని, 2022లో కూడా రూ. 21 లక్షలకు తనకు జీఎస్టీ నోటీసు వచ్చిందని ఆయన తెలిపారు. అప్పుడు తాను జీఎస్టీ ఆఫీసును సందర్శించి దీనిపై దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేశానని, కాని ఎటువంటి చర్య లేదని సింగ్ చెప్పారు.