GSLV-F14/INSAT-3DS MISSION: రేపు నింగిలోకి వెదర్ శాటిలైట్.. జీఎస్ఎల్వీ ద్వారా ప్రయోగం
GSLV-F14/INSAT-3DS MISSION: జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా వెదర్ శాటిలైట్‌ను రేపు ప్రయోగిస్తున్నారు. ఇన్శాట్ 3డీఎస్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనున్నారు. శ్రీహరికోట నుంచి శనివారం సాయంత్రం 5.30 నిమిషాలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్తుంది.
న్యూఢిల్లీ: కొత్త వెదర్ శాటిలైట్‌ను ఇస్రో రేపు ప్రయోగించనున్నది. నాటీ బాయ్‌గా పిలిచే జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా దాన్ని నింగిలోకి పంపనున్నారు. జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ ద్వారా ఇన్శాట్-3డీఎస్ మిషన్(GSLV-F14/INSAT-3DS MISSION)ను ప్రయోగించనున్నారు. శనివారం సాయంత్రం 5.30 నిమిషాలకు రాకెట్ నింగిలోకి ఎగరనున్నట్లు ఇస్రో వర్గాలు తెలిపింది. శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి దీన్ని ప్రయోగిస్తున్నారు.
జీఎస్ఎల్వీలో ఇది 16వ మిషన్. ఇన్శాట్ 3డీ శాటిలైట్‌ను జియోసింక్రోనస్ ఆర్బిట్‌లో ప్రవేశపెడుతారు. వాతావరణం గురించి ఆ ఉపగ్రహం సమాచారం ఇస్తుంది. జీఎస్ఎల్వీ మూడ దశల్లో ఇన్నైట్ అవుతుంది. లిఫ్టాప్ సమయంలో ఆ రాకెట్ బరువు 420 టన్నులు. తొలి దశలో ఘన ఇంధనం 139 టన్నులు, రెండవ దశలో 40 టన్నుల ఇంధనం, మూడవ స్టేజ్‌లో 15 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ జ్వలనం అవుతుంది.
ఇన్శాట్ 3డీఎస్.. మూడవ జనరేషన్ వాతావరణ ఉపగ్రహం. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఈ మిషన్‌కు పూర్తిగా ఫండింగ్ చేస్తోంది. భూమి, సముద్రాల్లోని ఉపరితలంపై ఉండే వాతావరణాన్ని ఈ ఉపగ్రహంతో అంచనా వేయనున్నారు. భారతీయ కంపెనీలు ఈ శాటిలైట్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాయి.
🚀GSLV-F14/🛰️INSAT-3DS Mission:
The mission is set for lift-off on February 17, 2024, at 17:30 Hrs. IST from SDSC-SHAR, Sriharikota.
In its 16th flight, the GSLV aims to deploy INSAT-3DS, a meteorological and disaster warning satellite.
The mission is fully funded by the… pic.twitter.com/s4I6Z8S2Vw— ISRO (@isro) February 8, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సద్దుల పొద్దు.. పూల సద్దు!
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

