న్యూఢిల్లీ : ట్రైన్ జర్నీలో రీల్ రికార్డింగ్ చేస్తున్న యువతుల బృందం వీడియో (viral video) ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ట్రెండింగ్ సాంగ్‌కు యువతులు డ్యాన్స్ చేస్తున్న వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వైదేహి అనే యూజర్ ఈ వైరల్ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసింది.
Bhai mere se train mein logo ke aage khana bhi khaya nhi jata😔😭 pic.twitter.com/esLxk9ymom
— whydahi(Himesh's version) (@vaidehihihaha) May 4, 2023
ఈ షార్ట్ క్లిప్‌లో గర్ల్స్ గ్యాంగ్ ట్రెండింగ్ సాంగ్ బీట్స్‌కు తగినట్టుగా ట్రైన్లో డ్యాన్స్ చేయడం కనిపిస్తుంది. వీరిలో ఇద్దరు వేర్వేరు బెర్త్స్పై క్రేజీ మూమెంట్స్ ఇవ్వగా మిగిలినవారంతా మొత్తం కంపార్ట్మెంట్ను ఆక్రమించారు. ట్రైన్లో నేను అందరి ముందు కనీసం ఆహారం కూడా తీసుకోలేను అని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.
ఈ వీడియోను ఇప్పటివరకూ 45,000 మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కొందరు కామెంట్స్ సెక్షన్లో యువతుల తీరుపై విమర్శలు గుప్పించారు. నాలో ఇంత కాన్ఫిడెన్స్ లేదని ఓ యూజర్ కామెంట్ చేయగా ముందు మెట్రో, ఇప్పుడు ట్రైన్లను టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోందని మరో యూజర్ చురకలు వేశారు.
Read More