పఠాన్‌కోట్: పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఉన్న ఆర్మీక్యాంప్ సమీపంలో పేలుళ్లు సంభవించాయి. సోమవారం తెల్లవారుజామున ఆర్మీక్యాంప్ సమీపంలోని త్రివేణి గేట్ వద్ద గ్రనేడ్ పేలుడు సంభవించింది. దీంతో అప్రమత్తమైన సైన్యం ఆ ప్రాంతాన్ని తమ ఆదీనంలోకి తీసుకున్నది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గ్రనేడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. ఈ ఘటనకు పాల్పడిందెవరనే అంశాన్ని సీసీటీవీలో పరిశీలిస్తున్నారు.
ఈ ఏడాది జూన్‌లో అత్యంత పటిష్ట భద్రత నడుమ ఉంటే జమ్ము ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో పేలుళ్లు సంభవించిన విషయం తెలిసిందే. డ్రోన్‌తో ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో దుండగులు దాడిచేశారు. ఇందులో ఇద్దరు సైనికులు గాయపడ్డారు.