Delhi-NCR | ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం.. గ్రాప్-1 ఆంక్షలు అమలు
Delhi-NCR : దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీతోపాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) పరిధిలో గ్రాప్ 1 (గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్) ఆంక్షల్ని ప్రభుత్వం అమలులోకి తెచ్చింది.
Delhi-NCR : దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీతోపాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) పరిధిలో గ్రాప్ 1 (గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్) ఆంక్షల్ని ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఇప్పటికీ ఢిల్లీలో వాయు కాలుష్య నాణ్యత పూర్ కేటగిరిలో ఉంది. బుధవారం ఉదయం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 223గా నమోదైంది.
వాయు కాలుష్యం పెరగడం, ప్రజలు శ్వాస సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న నేపథ్యంలో గ్రాప్ 1 ఆంక్షల్ని అమలు చేయాలని ఢిల్లీ పర్యవరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. దీని ప్రకారం ప్రజలు వాయు కాలుష్యానికి కారణమయ్యే కొన్ని చర్యల్ని ఆపేయాల్సి ఉంటుంది. గ్రాప్ 1 ప్రకారం.. ఢిల్లీలోని రెస్టారెంట్లు, హోటళ్లు, ఇతర చోట్లా ఎక్కడా వంట కోసం బొగ్గును వాడకూడదు. డీజిల్ జనరేటర్లను కూడా అత్యవసర పరిస్తితుల్లో తప్ప వాడరాదు.
మరోవైపు ఢిల్లీలో ఉష్ణోగ్రతలు కూడా పడిపోతున్నాయి. ఇది సగటు కంటే తక్కువ. సీపీసీబీ డాటా ప్రకారం.. ఏక్యూఐ 0 నుంచి 50 వరకు ఉండొచ్చు. దీన్ని గుడ్ కేటగిరిగా చెబుతారు. ఆ తర్వాత 51-100 వరకు ఉంటే శాటిస్ఫ్యాక్టరీగా, 101-200 ఉంటే మోడరేట్, 201-300 ఉంటే పూర్, 301-400 ఉంటే వెరీ పూర్, 401-500 ఉంటే సీవియర్ (అత్యంత ప్రమాదకరస్తాయి)గా పరిగణిస్తారు. ప్రస్తుతం ఢిల్లీ పరిధిలో పూర్ కేటగిరిలో వాయు కాలుష్యం ఉంది. ఇలాంటప్పుడు గ్రాప్-1 ఆంక్షల్ని అమలు చేస్తారు.
దీనివల్ల గాలిలోకి దుమ్ము, ధూళి, కాలుష్యం తక్కువగా వెలువడుతుంది. రోడ్డుపై వాహనాలు వెలువడుతున్నప్పుడు డస్ట్ రాదు. వివిధ నిర్మాణాలు, కూల్చివేతల సందర్భంగా కూడా దుమ్ము, ధూళి వెలువడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయంలో అధికారులు తనిఖీలు చేపడుతారు. చెత్త, ఆకులు, ఇతర వ్యర్థాల్ని బహిరంగంగా కాల్చకూడదు. కలప, బొగ్గు కాల్చకూడదు. డీజిల్ జనరేటర్లు ఎమర్జెన్సీలో మాత్రమే వాడాలి. అత్యంత వాయు కాలుష్యం వెదజల్లే వాహనాల్ని కూడా నిషేధిస్తారు. పరిశ్రమల నుంచి కూడా కాలుష్యం వెలువడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi-NCR | ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం.. గ్రాప్-1 ఆంక్షలు అమలు
ఎక్కువ ఈఎంఐ కట్టడమా?.. కాల వ్యవది పెంచుకోవమా?.. ఆర్బీఐ వడ్డీరేటు పెంచిన తరువాత ఏది బెటర్
Trishula Snanarchana | వేయిస్తంభాల ప్రాచీనకోనేరులో త్రిశూలస్నానార్చన
Theft Attempt | దొంగతనం చేసేందుకు సీసీ కెమెరాను బ్లర్ చేశారు.. కానీ ఏమైందో చూడండి.. వీడియో
AP News | ఏపీలో పలుచోట్ల టీడీపీ, వైసీపీ వర్గీయుల బాహాబాహీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

