న్యూఢిల్లీ: ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, అధికారిక పత్రాల్లో.. ఇకపై ‘భారత్’ అన్న పదమే వాడబోతున్నామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తాజాగా పేర్కొన్నాయి. ఈ మార్పు నేపథ్యంలో ఎదురయ్యే పర్యవసానాలపై పునరాలోచన ఏదీ లేదని కేంద్ర ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
‘భారత్.. పదాన్ని వాడటంలో చట్టపరమైన సమస్యలేవీ లేవు. ఇండియా, భారత్.. రెండూ చట్టపరంగా చెల్లుబాటు అయ్యేవే. పాస్పోర్ట్పైనా భారత్ సర్కార్ అని ఉంటుంది. కాబట్టి.. పేరుమార్పుపై పునరాలోచన లేదు’ అని పేర్కొన్నారు.