న్యూఢిల్లీ: 8వ వేతన సంఘం( Central Pay Commission) ఏర్పాటు చేసే అంశంపై రెండు ప్రతిపాదనలు వచ్చినట్లు కేంద్ర సర్కారు వెల్లడించింది. కానీ ఆ సంఘం ఏర్పాటుపై తామేమీ ఆలోచించలేదని ఇవాళ పార్లమెంట్లో కేంద్ర సర్కారు స్పష్టం చేసింది. 2026, జనవరి ఒకటో తేదీ నుంచి 8వ వేతన సంఘం సిఫారసులను అమలు చేయాల్సి ఉంటుంది. కానీ ఆ పే కమీషన్ ఏర్పాటు చేయాలని ఈ ఏడాది జూన్లో రెండు ప్రతిపాదనలు వచ్చాయని, కానీ వాటి గురించి ఏమీ ఆలోచించడం లేదని కేంద్ర సహాయ ఆర్థిక మంత్రి పంకజ్ చౌదరీ తెలిపారు. రాజ్యసభలో ఆయన లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను రివైజ్ చేసేందుకు ప్రతి పదేళ్లకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం పే కమీషన్ను నియమిస్తుంది. ఏడవ వేతన సంఘాన్ని.. 2014 ఫిబ్రవరిలో ఏర్పాటు చేశారు. ఆ పే కమీషన్ ప్రతిపాదనలను 2016, జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేస్తున్నారు.