Mithali Sharma | ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన కొన్ని నెలలకే లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మహిళా అధికారి..!
Mithali Sharma | ఆమె ప్రభుత్వ ఉద్యోగంలో చేరి ఎనిమిది నెలలే అయ్యింది. అప్పటికే ధన దాహంతో ఆమె లంచాలు వసూలు చేయడం మొదలుపెట్టింది. తాజాగా ఓ వ్యాపార సహకార సంఘంలో జరిగిన అవకతవకలను చూసీచూడనట్లుగా ఉండేందుకు ఆమె రూ.20 వేలు లంచం డిమాండ్ చేసింది. అందులో మొదటి విడతగా రూ.10 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కింది.
హజారీబాగ్: ఆమె ప్రభుత్వ ఉద్యోగంలో చేరి ఎనిమిది నెలలే అయ్యింది. అప్పటికే ధన దాహంతో ఆమె లంచాలు వసూలు చేయడం మొదలుపెట్టింది. తాజాగా ఓ వ్యాపార సహకార సంఘంలో జరిగిన అవకతవకలను చూసీచూడనట్లుగా ఉండేందుకు ఆమె రూ.20 వేలు లంచం డిమాండ్ చేసింది. అందులో మొదటి విడతగా రూ.10 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కింది. జార్ఖండ్ రాష్ట్రంలోని కొడెర్మా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మిథాలీ శర్మ ఏడాది క్రితమే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించింది. ఎనిమిది నెలల క్రితం కొడెర్మా జిల్లా కోఆపరేటివ్ విభాగం అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా ఆమెకు తొలి పోస్టింగ్ ఇచ్చారు. విధి నిర్వహణలో భాగంగా ఇటీవల ఆమె కొడెర్మా వ్యాపార్ సహ్యోగ్ సమితిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఆ సమితిలో అవకతవకలు జరిగినట్లు గుర్తించింది.
అయితే, బాధ్యులపై చర్యలు తీసుకుని ప్రభుత్వం దృష్టిలో మంచి అధికారిగా పేరు తెచ్చుకునే అవకాశాన్ని ఆమె చేజార్చుకుంది. బాధ్యులపై చర్యలు తీసుకోకుండా ఉండాలంటే రూ.20 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసింది. అందుకు అంగీకరించి సమితి సభ్యులు.. ఆ తర్వాత విషయాన్ని ఏసీబీ దృష్టికి తీసుకెళ్లారు. ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్‌తో మిథాలీకి రూ.10 వేల లంచం ఇప్పించి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దాంతో కష్టపడి ఉద్యోగం సంపాదించిన మిథాలీ శర్మ ఏడాది కూడా తిరక్కుండానే లంచానికి ఆశపడి కటకటాలపాలైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

