న్యూఢిల్లీ: డిజిటల్ ఇండియా బిల్లులోని నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.500 కోట్ల వరకు జరిమానా విధించేలా కేంద్రం ప్రతిపాదించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
ఏ డిజిటల్ మాధ్యమంలోనైనా జనరేట్ అయ్యే, మార్పిడి జరిగే, స్టోర్ అయ్యే డాటాను పర్యవేక్షించేందుకు, సేకరించేందుకు ఏ ప్రభుత్వ ఏజెన్సీకైనా కేంద్రం అధికారం కల్పించొచ్చని పేర్కొన్నాయి. మాల్వేర్ లేదా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడమే దీని ముఖ్య ఉద్దేశమని వెల్లడించాయి.