న్యూఢిల్లీ, జనవరి 17: స్థానిక కేబుల్ టీవీ ఆపరేటర్ల రిజిస్ట్రేషన్ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలించింది. రిజిస్ట్రేషన్ అధికారాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖకు అప్పగించడంతోపాటు స్థానిక కేబుల్ టీవీ ఆపరేటర్ల(ఎల్సీఓలు)రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్ కిందకు ప్రభుత్వం మార్చింది.
సవరించిన కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ నిబంధనలు-1994 శుక్రవారం నుంచే అమలులోకి వచ్చాయి. ఆధార్, పాన్, సిన్, డిన్తోపాటు ఇతర పత్రాలతోసహా దరఖాస్తును పరిశీలించిన తర్వాత రియల్ టైమ్లో స్థానిక కేబుల్ ఆపరేటర్ల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీ అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది.