హైదరాబాద్, మార్చి 14 (స్పెషల్ టాస్క్ బ్యూరో,నమస్తే తెలంగాణ): అశ్లీల కంటెంట్, అభ్యంతరకర చిత్రాలు, నగ్న వీడియోలను ప్రసారం చేస్తున్న ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌పై కేంద్రప్రభుత్వం కొరడా ఝళిపించింది. 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, 19 వెబ్సైట్లు, 10 యాప్‌లు, 57 సోషల్ మీడియా ఖాతాలను తొలగించినట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. తొలగించిన ఓటీటీ యాప్‌లలో ఒక యాప్‌నకు కోటికి పైగా డౌన్లోడ్స్ ఉండగా.. మరో రెండు యాప్‌లకు 50 లక్షల చొప్పున డౌన్లోడ్స్ ఉన్నట్టు కేంద్రం తెలిపింది.