న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: కేంద్ర సర్కార్ మరో ప్రభుత్వరంగ సంస్థను అమ్మేసింది. వాటాల విక్రయంలో భాగంగా ఫెర్రో స్క్రాప్ నిగం లిమిటెడ్(ఎఫ్ఎస్ఎన్ఎల్)ని జపాన్‌కు చెందిన కోనాయికీ ట్రాన్స్పోర్ట్ కో లిమిటెడ్‌కు రూ.320 కోట్లకు విక్రయించింది. స్టీల్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఎఫ్ఎస్ఎన్ఎల్..ఎంఎస్టీసీ లిమిటెడ్‌కు చెందిన 100 శాతం సబ్సిడరీ సంస్థ. ఈ ఎఫ్ఎస్ఎన్ఎల్ విక్రయానికి కేంద్రం గతంలోనే నిర్వహించిన బిడ్డింగ్ ప్రక్రియకు రెండు బిడ్డింగ్‌లు టెక్నికల్‌గా అర్హత సాధించాయి.
వీటిలో జపాన్‌కు చెందిన కోనాయికీ అత్యధికంగా రూ.320 కోట్ల బిడ్డింగ్ దాఖలుకు కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, హెచ్డీ కుమార స్వామి నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రిజర్వు ధర రూ.262 కోట్లుకాగా, బిడ్డింగ్ రూ.320 కోట్లు దాఖలవడంతో దీనికి మొగ్గుచూపింది కేం ద్రం.
మరో బిడ్ ఇండిక్ జియో రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్(చందన్ స్టీల్ లిమిటెడ్‌కు చెందిన సబ్సిడరీ సంస్థ) దాఖలు చేసినట్లు తెలిపింది. టోక్యో స్టాక్ ఎక్సేంజ్‌లో లిైస్టెన కోనాయిక్ ట్రాన్స్పోర్ట్ కో లిమిటెడ్. సంస్థకు స్టీల్ రంగంలో 140 ఏండ్లకు పైగా అనుభవం ఉన్నది. 1979 నుంచి ఎఫ్ఎస్ఎన్ఎల్ స్టీల్ మిల్ సేవలను అందిస్తున్నది. పలు స్టీల్ ప్లాంట్ల నుంచి సేకరించిన స్క్రాప్ స్టీల్‌ను తిరిగి వినిమయంలో తెస్తున్నది సంస్థ.