సంఖ్యా బలం లేదుగా..
ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ తమిళనాడు గవర్నర్ ఆర్లేకర్ వద్దకు వెళ్లిన టీవీకే చీఫ్ విజయ్‌కు ఊహించని షాక్ తగిలింది. తగినంత మెజారిటీ చూపించలేదని.. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి నిరాకరించారు.
- కాంగ్రెస్ మద్దతుతో వచ్చిన విజయ్‌తో గవర్నర్
- ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి నిరాకరణ
చెన్నై: ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ తమిళనాడు గవర్నర్ ఆర్లేకర్ వద్దకు వెళ్లిన టీవీకే చీఫ్ విజయ్‌కు ఊహించని షాక్ తగిలింది. తగినంత మెజారిటీ చూపించలేదని.. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి నిరాకరించారు. ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేలు తప్పనిసరిగా ఉండాలని గవర్నర్ స్పష్టం చేశారు. బుధవారం లోక్‌భవన్‌లో గవర్నర్‌ను విజయ్ కలుసుకున్నారు. కాంగ్రెస్ తనకు మద్దతు ఇచ్చిందని, వారి పేర్లతో కూడిన జాబితాను గవర్నర్‌కు వివరించారు. అయితే విజయ్ వాదనపై గవర్నర్ ఆర్లేకర్ పూర్తి సంతృప్తి చెందలేదు. విజయ్ను ఆహ్వానించటంపైనా, ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించటంపైనా అధికారిక నిర్ణయమేదీ తీసుకోలేదని లోకభవన్ వర్గాలు తెలిపాయి. ఎన్నికల ముందు డీఎంకేతో జతకట్టిన కాంగ్రెస్, ఫలితాల తర్వాత మిత్రపక్షాన్ని వీడి టీవీకే పంచన చేరటం తమిళనాట చర్చనీయాంశమైంది. ఇప్పుడు మరో ఆరుగురి ఎమ్మెల్యేల మద్దతు విజయ్‌కు అవసరం. మద్దతు ఇస్తాయని భావించిన వీసీకే (2), వామపక్షాలు(4), ఐయూఎంఎల్(2) ముందుకు రాలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

