న్యూఢిల్లీ: కేంద్ర సర్కారు ఎలక్ట్రిక్ హైవేల అభివృద్ధిపై దృష్టిసారించింది. భారీ ట్రక్కులు, బస్సులు రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడే సౌరవిద్యుత్తుతో చార్జ్ చేసేలా జాతీయ రహదారులను తీర్చిదిద్దనుంది. ఇండో అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఓ సమావేశంలో కేంద్ర మంత్రి గడ్కరీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ, ఎలక్ట్రిసిటీ ఆధారిత ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడంపై కేంద్ర సర్కారు దృష్టిపెట్టిందని తెలిపారు. టోల్‌ప్లాజాల వద్ద రద్దీని మరింత తగ్గించే లక్ష్యంతో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ వ్యవస్థను తీసుకురానున్నట్టు గడ్కరీ చెప్పారు.