న్యూఢిల్లీ: రైతులకు వ్యవసాయం ద్వారా ఆదాయాన్ని పెంచేందుకు ఓ రోడ్‌మ్యాప్‌ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం పార్లమెంటులో ప్రకటించారు. ఎగుమతి చేయడమే లక్ష్యంగా ఉండే 100 హార్టికల్చర్ క్లస్టర్లను రానున్న ఐదేళ్లలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. వీటి కోసం రూ.18,000 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడూ రైతులకు మేలు చేసే చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. నెహ్రూ, ఇందిర స్వాతం త్య్ర దినోత్సవాల ప్రసంగాల్లో రైతులు అనే మాట ఎప్పుడూ కనిపించలేదని ఆయన విమర్శించారు.