LPG cylinder: వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.100 తగ్గింపు
LPG cylinder: ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. వంట గ్యాస్ ధరను వంద తగ్గించినట్లు చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో ఈ చర్య చేపట్టినట్లు వెల్లడించారు. గ్యాస్ ధర తగ్గించడం వల్ల కోట్లాది కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గుతుందని ఆయన అన్నారు.
న్యూఢిల్లీ: ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ నేపథ్యంలో కేంద్ర సర్కార్ ఓ ప్రకటన చేసింది. ఎల్పీజీ సిలిండర్( LPG cylinder) గ్యాస్‌పై రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రధాని మోదీ ఇవాళ ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది ఇండ్లపై ఆర్థిక భారం తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా నారీ శక్తికి చాలా లబ్ధి చేకూరుస్తుందని అన్నారు. వంట గ్యాస్ ధరను అందుబాటులోకి తీసుకురావడం వల్ల, కుటుంబాలకు ఆర్థిక సహకారం అందుతుందని, ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని ఆయన తెలిపారు. మహిళల సాధికారత కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ కోణంలోనే ఈ చర్య చేపట్టామని, మహిళల జీవితాలు సరళం తరం చేసేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ అన్నారు.
Today, on Women’s Day, our Government has decided to reduce LPG cylinder prices by Rs. 100. This will significantly ease the financial burden on millions of households across the country, especially benefiting our Nari Shakti.
By making cooking gas more affordable, we also aim…
— Narendra Modi (@narendramodi) March 8, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

