యూరప్‌లో నిలిచిన వెబ్సైట్లు!
ఇంటర్నెట్లో ఎక్కువ భాగం ఉపయోగించే పీహెచ్‌పీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో రెండు తీవ్రమైన భద్రతా లోపాలు బయటపడటంతో ఐరోపాలోని ప్రభుత్వ సంస్థలు బుధవారం తమ వెబ్సైట్లను తాత్కాలికంగా మూసివేశాయి. గతంలో గుర్తించిన రెండు తీవ్రమైన లోపాలను సరిచేస్తూ కొత్త అప్డేట్లను అందుబాటులోకి తెచ్చినట్టు పీహెచ్‌పీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలపర్లు తెలిపారు. అలాగే మునుపటి లోపాన్ని పరిష్కరించడంలో ఆలస్యం జరిగినట్టు అంగీకరించారు.
- పీహెచ్‌పీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో లోపాన్ని గుర్తించిన ఏఐ
- చర్యలు చేపట్టిన ఆయా దేశాలు
న్యూఢిల్లీ: ఇంటర్నెట్లో ఎక్కువ భాగం ఉపయోగించే పీహెచ్‌పీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో రెండు తీవ్రమైన భద్రతా లోపాలు బయటపడటంతో ఐరోపాలోని ప్రభుత్వ సంస్థలు బుధవారం తమ వెబ్సైట్లను తాత్కాలికంగా మూసివేశాయి. గతంలో గుర్తించిన రెండు తీవ్రమైన లోపాలను సరిచేస్తూ కొత్త అప్డేట్లను అందుబాటులోకి తెచ్చినట్టు పీహెచ్‌పీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలపర్లు తెలిపారు. అలాగే మునుపటి లోపాన్ని పరిష్కరించడంలో ఆలస్యం జరిగినట్టు అంగీకరించారు.
ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్న సంస్థలు వెంటనే అప్డేట్లను ఇన్స్టాల్ చేయాలని లేదా ప్రభావిత సిస్టమ్‌లను ఆఫ్‌లైన్ చేయాలని యూఎస్ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ విజ్ఞప్తి చేసింది. ఈ లోపాల వల్ల హ్యాకర్లు నేరుగా సర్వర్ ఫైల్ సిస్టమ్ లేదా డాటాబేస్‌ను యాక్సెస్ చేసే ప్రమాదం ఉన్నదని హెచ్చరించింది. ఈ లోపాలను ‘నిర్మాణాత్మక వైఫల్యం’గా పీహెచ్‌పీ ఫౌండేషన్ అభివర్ణించింది. తగిన పరిస్థితులు ఉంటే.. ప్రమాదకరమైన వ్యక్తులు సర్వర్లలో తమ కోడ్‌ను రన్ చేసేందుకు ఈ రెండు లోపాలు ఆస్కారం ఇస్తాయని పేర్కొన్నది.
ఈ లోపాలను ఎలా గుర్తించారు?
ఒక సెక్యూరిటీ పరిశోధకుడు 2024లోనే ఈ లోపానికి సంబంధించిన సంకేతాలను గుర్తించారు. అయితే అది కేవలం సిద్ధాంతపరంగానే ఉన్నదని, స్పష్టమైన ప్రభావం చూపించే ఇతర సమస్యల కారణంగా దీనిపై ఎక్కువ దృష్టి పెట్టలేదని తెలిపారు. తర్వాత పీహెచ్‌పీ ఫౌండేషన్ తమ ప్రాజెక్ట్‌ను ‘ప్యాచ్ ది ప్లానెట్’ ప్రోగ్రామ్‌లో చేర్చింది. ఇందులో భాగంగా కాలిఫ్ అనే సెక్యూరిటీ సంస్థ ఈ ఏడాది జూలై 30న పీహెచ్పీపై ఆడిట్ ప్రారంభించింది. ఆగస్టులో కాలిఫ్, చాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్ ఏఐ సంస్థలు ఒకే రోజున స్వతంత్రంగా ఈ లోపాలను నివేదించాయి. ఆ తర్వాత గూగుల్ ఆధ్వర్యంలోని క్లౌడ్ సెక్యూరిటీ సంస్థ విజ్ కూడా ఈ లోపాలను దుర్వినియోగం చేసే మరిన్ని మార్గాలను గుర్తించింది. ఈ లోపాల వివరాలను పీహెచ్‌పీ డెవలపర్లకు రహస్యంగా తెలియజేసి సవరణలు సిద్ధమయ్యేవరకు గుప్తంగా ఉంచారు.
వెబ్సైట్ల నిలిపివేత
ప్రాన్స్‌లో పారిస్ పోలీస్ ప్రిఫెక్చర్ సహా పలు స్థానిక ప్రభుత్వ వెబ్సైట్లను ఫ్రెంచ్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సూచనల మేరకు బుధవారం మధ్యాహ్నం నుంచి నిలిపివేసినట్టు అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. నెదర్లాండ్స్‌లో అధికారులు ముందస్తు జాగ్రత్తగా డిజిటల్ ఐడెంటిటీ సర్వీస్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ వెబ్సైట్, నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ సైట్లను తాత్కాలికంగా మూసివేసినట్టు డచ్ బ్రాడ్‌కాస్టర్ ఎన్‌వోఎస్ నివేమంత్రిత్వశాఖ ముందస్తు జాగ్రత్తగా తమ వెబ్సైట్లను ఆఫ్‌లైన్ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

