BJP on Punjab Crisis |పంజాబ్‌లో పాలన కుక్కల పాలైందని బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ వ్యాఖ్యానించారు. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామాపై తరుణ్ చుగ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ గత రెండున్నర నెలలుగా వివిధ శాఖల మంత్రులు తమ కార్యాలయాలకు హాజరు కావడం లేదని పేర్కొన్నారు.
మాఫియాకు పాలన అప్పగించి పాపాలు మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మట్టి కరిపించాలని తరుణ్ చుగ్ పంజాబ్ ప్రజలకు పిలుపునిచ్చారు. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా రాజీనామా చేసిన సిద్ధూకు సంఘీభావంగా మంత్రి రజియా సుల్తానా, కాంగ్రెస్ నేతలు పర్గత్ సింగ్, గుల్జార్ ఇందర్ చాహల్ తదితరులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.