న్యూఢిల్లీ: ఇండియాలోని గల్లీ గల్లీకి గూగుల్ మ్యాప్స్ స్ట్రీట్ వ్యూ ఫీచర్ను గూగుల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ను ఉపయోగించి ఒక రోడ్డులో వీధి ఎలా ఉంది? ఆ వీధిలో ఏయే షాపులున్నాయి? లాంటి వివరాలను తెలుసుకోవచ్చు.
దేశంలోని ప్రతి ఊరు, పట్టణం, నగరంలోని వీధులను 360 డిగ్రీలో వీక్షించొచ్చు. గూగుల్ ఈ స్ట్రీట్ వ్యూ ఫీచర్ను కర్ణాటక రాజధాని బెంగళూరులో పైలట్ ప్రాజెక్టుగా నిరుడు లాంచ్ చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చింది.